పుట:Lokokthimukthava021013mbp.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

781 కడుపుతో వున్నమ్మ కనకమానునా, వండినమ్మ తినక మానునా

782 కడుపునిండా గారలు తింటే వొంటి నిండ జ్వరము

783 కడుపు నిండిన బేరము

784 కడుపు నిండిన వానికి గారెలు చేదు

785 కడుపులోని బిడ్డ కడుపులో వుండగా కొడుకుపేరు సోమలింగం

786 కడుపు లోని మాటంటే వూరంతా అవుతుంది

787 కడుపులోలేనిది కావిలించుకుంటే వస్తుందా

788 కడుపువస్తే కనే తీరవలెను

789 కతలమారి మొగుడు కమ్మలు చేయిస్తే, అప్పుల కూటిమొగుడు అమ్ముక తిన్నాడట

790 కతికెతే అతకదు

791 కత్తి తీసి కంపలో వేసి యేకుతీసి పొడుచుకుంటా నన్నట్లు

792 కత్తిపోటు తప్పినా కలంఫోటు తప్పదు

793 కత్తి మేత్తన అత్త మంచి లేదు

794 కత్తి వాడియా కలంవాడియా

795 కత్తెరపోటుకు కదల పారుతుంది

796 కద్దు అనడానికి లేదు, అనడానకు దీనికే అధికారమా

797 కధకు కాళ్లులెవు ముంతకు చెవులు లేవు

798 కననిది బిడ్డకారు, కట్టనిది బట్టకాదు

799 కని గృడ్డి, విని చెవిటి

800 కనుక్కొని రారా అంటే కాల్చివచ్చేవాడు