పుట:Lokokthimukthava021013mbp.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విన్నపము

"సామెతలు ప్రసంగానికి దీపాలు" ప్రసంగిస్తూ ఒక్క సామెతను ప్రయోగించామంటే అది ప్రసంగానికి అందమును, కాంతిని దెచ్చును. సామెతలో ధ్వని ఉంటుంది. సమయోచితముగ ప్రసంగములో ఒక సామెతను కలిపామంటే, పాలలో పంచదార కలిపినట్లుండును.