పుట:Lokokthimukthava021013mbp.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

634 ఏటిదరి మ్రానికి ఎప్పుడు చలనము

635 ఏటి యీతకు లంకమేతకు సరి

636 ఏటివద్ద నక్కకాగానే పాటిరేవు ఎరుగునా

637 ఏటివొడ్డు చేను

638 ఏట్లోవంకాయలు కాస్తవా అంటే కాస్తవి అన్నట్లు.

639 ఏట్లో వేసినా యెంచి వేయవలెను

640 ఏడిచేదాని మొగుదువస్తే నమొగుడు వస్తాడు

641 ఏడిచే బిడ్డకు అరటిపండు చూపినట్లు

642 ఏడుపులో ఏడుపు యెడమచెయ్యి బయట పెట్టాన్నట్టు

643 ఏడుస్తూ యేరువాక సాగితే కాడిమోకులు దొంగలెత్తుకపోయినారట

644 ఏదుకు పెడతల బుద్ధి

645 ఏతాంపాటకు యెదురుపాట లేదు

646 ఏదీకానివేళ గేదెయీనినట్లు

647 ఏట్లోనా రేనీళ్ళు యెవరుతాగితేయేమి

648 ఏట్లో ఉదకమున్నది సూర్యదేవా

649 ఏట్లోకలిపిన చింతపండు

650 ఏట్లోపడ్డవానికి యెన్నో యెన్నికలు

651 ఏనుగంత తండ్రి యుండుట కంటె యేకంత తల్లి యుండుటమేలు

652 ఏనుగు యెత్తుపడితే దోమ దొబ్బసాగెనట

653 ఏనుగుకుకాలు విరగడము దోమకురెక్క విరగడము సమము

654 ఏనుగకు ఒకసీమ, గుఱ్ఱానికి ఒకవూరు, బఱ్ఱెకు ఒక బానిస