పుట:Lokokthimukthava021013mbp.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

625 ఏకముండం గృహచ్చిద్రం ద్విముండం గృహనాశనం త్రిముండం గ్రామనాశంచ చతుర్కుండంచ పట్టణం అధవా పంచముండంచ బ్రహ్మపట్ల వినశ్యతి

626 ఏకాదశ బ్రాహ్మడా అంటే కాలేకొరివి యెగసన తోస్తావా అన్నాడట ద్వాదశ బ్రాహ్మడా అంటే ఆపదలు కాపురాలు చేస్తవా అన్నాడట

627 ఏకాదశినాడు కాలు అంటుకుంటా వేమి అంటే అది నిత్యవ్రతము నేడే ఆరంభము అన్నాడట. మర్నాడు తల యెందుకు అంటుకోలేదు అంటే నిన్నటితో వ్రతసమాప్తి అన్నాడట

628 ఏకాలు జారినా పిఱ్ఱకే మోసము

629 ఏకులవంటి మెతుకులు పోసుకుని యెనుప పెరుగు నేను కొని యవరాలిని గనుక తింటున్నాను గాని దగ్గరకు రాకండి పిల్లల్లారా జడుసుకునేరు

630 ఏ#కులు వుంచితే బుట్ట చిరుగుతుందా

631 ఏగాలికి ఆ చాపయెత్తినట్లు

632 ఏటి అవతలి ముత్యములు తాటికాయలంతేసి

633 ఏటికి యెప్పుడు పోయినావు, యిసుక యెప్పుడు తెచ్చినావు అంటే ఆడువారు తలిస్తే అది యెంతసేపు అన్నదట. మగవారు తలిస్తే యిది యెంత సేపు అని నాలుగు బాదినాడట.