పుట:Lokokthimukthava021013mbp.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

590 ఎన్నో వ్రణములుకోసినాను గాని నావ్రణంత తీపులేదు

591 ఎప్పటి అమ్మకు నిప్పటేగతి

592 అప్పటిమేలు అప్పటికే

593 ఎరగనివూళ్లో యెమ్మెలుచేస్తే యేకులు నీ మొగుడు వడుకుతాడా

594 ఎముక లేనినాలుక ఎటుతిప్పినా తిరుగుతుంది

595 ఎరుకపెడికెడు ధనం

596 ఎరుకసత్యముకాదు వాక్కుతోడుకాదు

597 ఎరువులసొమ్ము యెరువులవారు ఎత్తుకపోతే పెండ్లికొడుకు ముఖాన పేడానీళ్ళు చల్లినట్టేవుంటుంది

598 ఎరువులసొమ్ముబరువులచేటు తియ్యాపెట్టా తీపులచేటు అందులో ఒకటిపోతే అప్పులచేటు

599 ఎఱ్ఱను చూపి చేపను పట్టినట్లు

600 ఎలుక యేట్లోపోతేనేమి పిల్లి బోనులోపోతేనేమి

601 ఎలుక ఎంత ఏడ్చినా పిల్లి తనపట్టు వదలదు

602 ఎలుకకు పిల్లి పొంచువేసినట్లు

603 ఎలుకకు పిల్లి సాక్ష్యము

604 ఎలుకచావుకు పిల్లి మూర్చపోవునా

605 ఎలుకమీద కోపాన యిల్లు చిచ్చుబెట్టుకున్నట్లు

606 ఎల్లవార లమ్మల బ్రతుకు తెల్లవారితే తెలుస్తుంది

607 ఎలుగుబంటికి దంతము తీసినట్లు

608 ఎల్లిశెట్టి ఎక్కయే లెక్క

609 ఎవరబ్బ సొమ్మురా యెక్కియెక్కి ఏడ్చెవు