పుట:Lokokthimukthava021013mbp.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

522 ఊరిజబ్బు చాకలి యెరుగును. ఉద్యోగిజబ్బు బంట్రోతెరుగును

523 ఊరి కేవస్తే మావా డింకొడున్నాడు

524 ఊరికే ఉండ లేకపోతే ఉరిబెట్టుకో

525 ఊరిపిడుగువచ్చి వీరిసెట్టిని కొట్టుకపోయిందే

526 ఊరిమీద నూరుపడ్డా, కరణంమీద కాసుపడదు

527 ఊరివాడికి కాటిభయం పొరుగూరువాదికి నీటిభయం

528 ఊరివారిబిడ్డను నగరువారుకొట్టితే నగరివారిబిడ్డను నరాయణ కొట్టుతాడు

529 ఊరు ఉన్నది చిప్పఉన్నది

530 ఊరు ఉస్తికాయంత సిద్ధాంతం తాటికాయంత

531 ఊరు పొమ్మంటున్నది కాడురమ్మంటున్నది

532 ఊరువిడచి పొరుగూరు వెళ్ళినా పూనినఖర్మం మానదు

533 ఊరువారి నడ్లపుణ్యాన మా అత్తముడ్డిపుణ్యాన్ని, నాకు నేడు భోజన మమరింది అన్నాడట

534 ఊరేచేరవద్దు రౌతాఅంటే గుర్రాన్ని ఎక్కడకట్టేసేది అన్నాట్ట

535 ఊళ్ళు యేలే కుమారుడికన్నా ఉపాదానంయెత్తే పెనిమిటి మేలు