పుట:Lokokthimukthava021013mbp.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

504 ఊచగల మగవాడు ఊరికిపోతే పెసర ఛేను అడ్డమాయెనట

505 ఊడుగ విత్తనంవంటివాడు

506 ఊదకూ డెన్నాళ్ళు ఉద్యోగం యెన్నాళ్ళు

507 ఊరంతా వూగిముఖము దాసరి తాళ్ళముఖము

508 ఊపిరిపట్టితే బొజ్జనిండునా

509 ఊరంతాచుట్టాలు ఉట్టికట్టటానికి తావులేదు

510 ఊరంతా నాన్నకువణికితే నాన్న అమ్మకు వణికినట్లు

511 ఊరంతా వడ్లుయెండబెట్తుకుంటే నక్క తోక యెండబెట్టుకున్నదట

512 ఊరకుంటు, అడవివేడి

513 ఊరంతాఉల్లి నీవెందు కేతల్లి

514 ఊరపిచ్చుకకు తాటికాయంత గూద

515 ఊరపిచ్చుకమీద తాటికాయ ఉంచినట్లు

516 ఊరపిచ్చుకమీద వాడివజ్రాయుధమా!

517 ఊరించి ఊరించి ఉగాదినాడు బూరిచ్చెనట

518 ఊరికంతకు ఒకత్రోవ ఉలిపి కట్టెకు ఒకత్రోవ

519 ఊరికంతకు ఒకతేబోగముదైతే యెవరివద్ద ఆడుతుంది

520 ఊరికిపోయేవానికి లేకపోయినా, బహిర్భూమికి పోయే వానికి భత్యము కట్టుమన్నట్టు

521 ఊరికి ఉపకారంగా భార్యము చీరకొనిపెడతాను ఇంటికి డబ్బుయివ్వండి అన్నాడాట