పుట:Lokokthimukthava021013mbp.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

463 ఉడుమును చంకబెట్టుకొని వూళ్లో ప్రవేశించినట్లు

464 ఉడుముపోయినా చెయ్యివస్తేచాలు

465 ఉడుకుజుర్రి తే నోరు కాలుతుంది

466 ఉతికెవారికిగాని చాకలి వుతకడు

467 ఉత్తచెనికన్నా తాటాకుచెవె మేలు

468 ఉత్తచేతులు మూరవేసినట్లు

469 ఉత్తముండకన్నా అత్తముండమేలు

470 ఉత్తరకుమార ప్రతిజ్ఞలు

471 ఉత్తరచూచి యెత్తరగంప

472 ఉత్తర ఉరిమినా పాము తమిరికరచినా తిరుగదు

473 ఉద్యోగం పురుషలక్షణం అదిపోతే అవలక్షణం

474 ఉద్యోగం పురుషలక్షణం అన్నాడు గొడ్డలితేరా నిట్రాడు నరుకుదాము

475 ఉన్నది ఒకకూతురు వూరెల్లా అల్లుళ్ళు

476 ఉన్నమాట అంటే వులుకు

477 ఉన్నమాట చెప్పితే వూరు అచ్చిరాదు

478 ఉన్నవాడు ఊరికిపెద్ద, చచ్చినవాడు కాటికిపెద్ద

479 ఉపకారం అంటే వూరినుంచి లేచిపోయినట్లు

480 ఉపకారమునకు పోతే అపకారం వెంటనే వచ్చినది

481 ఉపనయనం నాటిమాట ఉండక మానదు

482 ఉపాధ్యాయులవారు ఉక్తం ఉక్తం

283 ఉపాధ్యాయులు ఏమి చేస్తున్నాడంటే తప్పులు వ్రాసి దిద్దు కుంటున్నాడు