పుట:Lokokthimukthava021013mbp.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

389 ఇప్ప పూవులకు వాసన వెతకవలెను

390 ఇరుగింటమ్మా పొరుగింటమ్మా మాయింటాయన గోడు చూడు

391 ఇరుపోటీల యిల్లు చెడును, వాత నొప్పుల వొళ్ళు చెడును

392 ఇరుసున కందెన పెట్టక పరమేశ్వరు బండియైన బారదు

393 ఇలిటవువాడు యింటికిచేటు కొమ్ముఒలబర్రేకొట్టానికి చేటు

394 ఇల్లలుకగానే పండుగ అవుతుందా

395 ఇల్లాలు గుడ్డిదైతే ఇంటి కుండలకు చేటు

396 ఇల్లు కట్టిచూడు పెళ్ళి చేసిచూడు

397 ఇల్లు కాలబెట్తి జల్లెడతో నీళ్లు పోసినట్లు

398 ఇల్లు కాలి ఒక డేడుస్తుంటే ఒళ్ళుకాలి ఓకడేడ్చినట్లు

399 ఇల్లుకాలినా యిల్లాలు చచ్చినా గొల్లుమానదు

400 ఇల్లుకాలింది జగమయ్యా అంటే నాజోలె కప్పరా నాదగ్గరున్నది అన్నాట్ట

401 ఇల్లు గాలుచుండగా వాసాలు దూసుకున్నట్లు

402 ఇల్లు గెలువలేనివాడు రచ్చ గెలుచుగా

403 ఇల్లు చొరబడి యింటి వాసాలు లెక్కపెట్టినట్లు

404 ఇల్లు తిరిగిరమ్మంటే యిలారం తిరిగివచ్చినట్లు

405 ఇల్లు మింగే అత్తగారికి యుగంమింగే కోడలు

406 ఇల్లు ఇరకాటం ఆలి మర్కటం

407 ఇల్లుయేడ్చే అమావాస్య, యిరుగూపొరుగూ యేడ్చే తద్ధినం, వూరుఏడ్చే పెండ్లి రేపు