పుట:Lokokthimukthava021013mbp.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

298 ఆరు నెలలు సాముచేసి మూలనున్న ముసిలిదానిని కొట్టి నాడట

299 ఆరెలమ్రానునుక్రింద బూతలమ్రాను విరగబడ్డట్టు

300 ఆర్చేవారేగాని తీర్చేవారులేరు

301 ఆర్చేవా తీర్చేవా అక్కవవస్తే మూలిగేవా

302 ఆలికి అన్నంపెట్టడం ఊరికి ఉపకారము

303 ఆలిని వల్ల నివాసానికి యీలకూరలో వుప్పుచాలదు

304 ఆలివంకవారు ఆత్మబంధువులు, తల్లివంకవారు, ఆగిన వారు, తండ్రివంకవారు దాయాదులు

305 ఆలు కాదది వ్రాలు

306 ఆలువల్లిక అరవైయేండ్లు, మగడువల్లిక ముప్పైయేండ్లు, బాలప్రాయం పదియేండ్లు

307 ఆలూమొగుడు మధ్యపోట్లాట అద్దంమీద పేసరగింజ వేసినంతసేపు

308 ఆలూలేదు చూలూలేదు కొడుకు పేరు సోమలింగం

309 ఆళ్ళు కొత్తవిఅయితే తిరుగళ్ళు కొత్తవా

310 ఆవగింజ ఆట్టెదాచి గుమ్మడికాయలు గుల్లకాసుగా యెంచేవాడు

311 ఆవగింజకు సందువుంటే అరవైగారెలు అప్పుడేతిననా

312 ఆవతిన్న అమ్మకు యేవపారిందట

313 ఆలు గుణవంతురాలైతే మేలుకలుగును

314 ఆవలింతకు అన్నదమ్ములున్నారు గాని తుమ్ముకుతమ్ముడు లేడు.