పుట:Lokokthimukthava021013mbp.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

239 ఆకలిగొన్న బిచ్చగానికి వంటింట్లో వేయించిన ఉల్లిపాయల వాసనతగిలినట్లు.

240 ఆకలిగొన్నవానికి అనుష్టుప్పుశ్లోకాలతో పొట్ట నిండునా

241 ఆకాశమునకు వెండ్రుకకు ముడివేసెద నన్నట్లు.

242 ఆకాశ పంచాంగము.

243 ఆకాశమును గద్ద తన్నుకొనిపోయినట్లు.

244 ఆకాశ వర్తకుడు.

245 ఆకాశానికి నిచ్చనవేసేవాడు.

246 ఆకాశ రామన్న

247 ఆకుబోయి నూతపడితే వెతకబోయి యేడుగురు పడ్డారట.

248 ఆకు అందరు పోకను అందరు.

249 ఆకులు పట్టుదురు ఆడవాళ్ళు, కల్లు పంచుదురు మగవాళ్ళు

250 ఆగడవలు వేసినవి అత్తగారా అంటే, కొలబుర్ర వాచేతులోనే వున్నది కోడలా అన్నదట.

251 ఆగభోగాలు అక్కకుడిస్తే అంబడివరకలు బావకుడిచినాడు

252 ఆచారం అదిరిపడ్డది, దూపార్తి తుళ్ళిపడ్డది కొత్తకుండ తేరా నేత్రాళ్ళు వండుకుందాము.

253 ఆచారం ఆచారం అన్నంభొట్లా అంటే, పెద్దచెరువు కుక్కముట్తుకొన్నది అన్నట్లు.

254 ఆచారం ముందర, అనాచారం వెనక.

255 ఆచారానికి అంతములేదు, అనాచారానికి ఆదిలేదు.

256 ఆచార్యుని తలచి నిప్పులో చేయిపెట్టితే కాలదా?

257 ఆచార్యునికి ద్రోహంచేసినా, ఆత్మకు ద్రోహంచేయరాదు.