ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సీ
3303 సీతకు వ్రాసినది సీమకు వ్రాయవలెనా
3304 సీత పుట్టుక లంకచేటుకే
సు
3305 సుకుమారి దేహానికి మెత్తటి చెప్పులు
3306 సుఖము కష్టము నకే
3307 సుఖవాసి దేహము మెత్తని చెప్పుతో కొట్టవలెను
3308 సుగ్రీవాజ్ఞ
3309 సుత్తెముందా కారుముందా
3310 సున్నంపుట్టని వూళ్ళో అన్నం పుట్టునా
3311 సున్నంలోవున్నది సూక్ష్మం సూక్ష్మంలోవున్నది మోక్షం
3312 సుపుఇత్రా కొంప చెరపుకురా
3313 సువ్వీ అంటే రోకంటి పోటు
3314 సర్పసంతానమా ! గో సంతానమా
సూ
3315 సూదికిగాను సోదికిగాను పోతే పాతకంకులు బైలు పడ్డయి
3316 సూదిగొంతు బానకడుపు
3317 సూదివలెవచ్చి దబ్బనంవలె తేలినట్లు
3318 సూదేటివాణ్ణి, సుత్తేటువాణ్ణి, కందేటువాణ్ణి నమ్మరాదు