ఈ పుట ఆమోదించబడ్డది
3235 శుభం పలకరా పెండ్లికొడకా అంటే యెవడి ఆలితాడు తెగితే నాకేమి నాకు నేనే పిండాకూడు నాకు వేస్తే అవి తిని రేణికండలకాడ చచ్చినట్టే తొంగుంటారు అన్నాడట
3236 శుష్కప్రియాలు శూన్యహస్తాలు
శె
3237 శెట్టిశృంగారించేలోగా పట్నం కోలబోయింది
3238 శెట్టి శేరులింగం అరివీసెడు
3239 శనగలుతింటూ వులవలనిచెప్పి పత్తివిత్తులు చేతిలో పెట్తినట్లు
శే
3240 శేరుకు సవాసేరు
3241 శేకుభాయీకి గోకలాష్టమి వొకటా
3242 శేరు దొరకు మణుగు బంటుకు
3243 శొంఠిలేని కషాయం లేదు
3244 శ్మశానమునకు పోయినశవము తిరుగునా
3245 శ్రీరామ రక్ష
3246 శ్వాసవుండేవరకు ఆశవుంటుంది
3247 షండుని కేలరా పత్నీధారణ
3248 శేరువల్లినెత్తురులో రెండుతులాలు తలుపుకిరకిర కలిపి మర్ధనచేసి పుచ్చుకొన్నట్లు
3249 శంఖు భాయీకి గోకులాష్టమి వొకటా