పుట:Lokokthimukthava021013mbp.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

98 అదృష్టంచాలని ఆడబిడ్డను అక్కరలేని అల్లునికిచ్చి అమావస్యా ఆదివారంనాడు ఆర్ధ్రానక్షత్రాన అతి వైభవంగా వివాహం జరిపినట్లు.

99.అద్దముమీద పెసరగింజ పడ్డట్టు

100 అద్దములోని ముడుపు

101 అద్దె పేరంటము, సిద్ది మురికి

102 అధమునికి ఆలి అయ్యేకంటే బలఫంతునికి బానిస అయ్యేది మేలు.

103 అధిక ఆషాడం

104 అధికాశ లోకదారిద్ర్యము

105 అని అనిపించుకోవాలా అత్తగారు

106 అనుమానము ప్రాణసంకటము.

107 అనువుగాని చోట అధికుల మనరాదు

108 అన్నంపెట్టేతే అరిగిపోతుంది చీరయిస్తే చిరిగిపోతుంది వాతపెట్టితే కలకాలం వుంటుంది.

109 అన్నం పెట్టినవారి యింటికి కన్నం పెట్టును.

110 అన్న చొరవేగాని అక్షర చొరవలేదు.

111 అన్నదీక్షయేగాని అక్షరదీక్ష లేదు.

112 అన్నప్పుడల్లా ముద్దు పెట్టుకోనిచ్చే ముగ్ధయెవరు.

113 అన్నమదముంటే అన్ని మదాలు వుంటవి

114 అన్న దేవరసన్నగిల్లితే అన్ని సన్నగిల్లుతవి.