పుట:Lokokthimukthava021013mbp.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3166 వెళ్ళిపొమ్మంటే చూరుపట్తుకొని వేళ్లాడినట్లు

వే

3I67 వేటుకువేటు మాటకుమాట వుందవలెను

3I68 వేడుకకు వేలలేదు

3169 వేడినీళ్ళకు చనీళ్ళు చన్నీళ్ళకు వేడినీళ్ళు

3170 వేన్నీళ్ళ కోర్వలెనమ్మ సహగమనం చేస్తాల్నన్నదట

3171 వేణ్ణీళ్ళకు వేసంగికి యెంతచలవో నీకూనాకూఅంతచలవ

3172 వేన్నీళ్ళపోస్తే యిండ్లుకాలునా

3173 వేప చాలాకాస్తి మశూచికములు మెండు

3174 వేల పిండి యెరువుకు సమానము

3175 వేగుతవ్వి వేడినీళ్లు పోసినట్లు, వేలంవెర్రి

3176 వేలుమీద గోరుమొలిచింది వేరుపోదాంరారా వెర్రిమొగుడా

3177 వేలుకు వేలడము

3178 వేలుకోసుకున్నా సున్నంపెట్టడు

3179 వేర్లతో వెంపలి కాయలతో కానుగలువేస్తే పండును

318O వేలుచూసి ఉత్తదనిపించు కున్నట్లు

3181 వేలువంగబెట్టంది వెన్నయినారాదు

3182 వేసిందే ఒకగంతు విరిగిందే వొకకాలు

3183 వేసినట్లే వేస్తే వెర్రివాడైనా గెలుస్తాడు

3184 వేసిన వెదుళ్ళల్లారా కాలినయిండ్లకు పొండి

3185 వేశ్యామోహం

3186 వేషాలమారికి వేవిళ్ళువస్తే వున్నచోటు కదలన్నదట