పుట:Lokokthimukthava021013mbp.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3146 వెయ్యి ఆవులు గలవానికి ఒకటి తన్నుకొని పోతేయేమి

3147 వెయ్యికాళ్ళ జెర్రి

3148 వెయ్యిపుట్ల వడ్లకు ఒక్క చిలకపురుగు చాలు

3149 వెయ్యిరూపాయలు కావలెనా వెధవతో వుట్టువు కావలెనా

3150 వెయ్యివరహాలు పెట్టి యేనుగును కొనుకొని అరవీశెడు అంకుశానకు పాలుమాలనా

3151 వెర్రిముండ వేడుక చూడబోతే వెతకనిద్దరు యేడ్వనిద్దరు

3152 వెర్రిమొద్దుల కేల వేదశాస్త్రాలు

3153 వెర్రివాడిచేతి రాయి

3154 వెర్రివాడిపెండ్లాము వాడవదిన

3155 వెర్రివానివిందు పెట్టేవరకు నిశ్ఛయం లేదు

3156 వెర్రువెయ్యివిధాలు పైత్య్హం పదివేల విధాలు

3157 వెలగల జీవరత్నం వొక్కటేచాలు

3158 వెలమ వారిపెండ్లి కొడుకు మారడగ నేరడు వున్నదంతా వూడ్చిపెట్టి

3159 వెలలేని మాణిక్యం

3160 వెలసులభం ఫలమధికం

3161 వెలిపొలమును వెధవపిల్లను విడువరాదు

3162 వెలుగునీడ గ్రామంతోడు

3163 వెల్లకిలా పరుండి వుమ్మువూస్తే ముఖానపడుతుంది

3164 వెల్లకిలావేసి పొదిస్తే వొక్కదెబ్బకే చస్తుంది సన్యాసులమైన మేమెందుకు చెప్పాలె

3165 వెల్లటూరులో యెద్దును చరుచూరులో పడుచును యివ్వరాదు