పుట:Lokokthimukthava021013mbp.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3109 వినాయకుడి మీద భక్తా వుండ్రాళ్ళ మీద భక్తా

3110 విని రమ్మంటే తిని వచ్చినట్లు

3111 విన్నమ్మ వీపుగాలింది కన్నమ్మ కడుపు కాలింది

3112 విన్నవన్నీ విశ్వసించవద్దు, విశ్వసించిన వన్నీ వెలిబుచ్చ వద్దు

3113 విరామము లేని పనికి వూరట లావు

3114 విల్లూరి మర్రిక్రింద విధివున్నది

3115 విశ్వమేలే నకులుడు అశ్వసిక్షకుడె నాడు

3116 విశాఖ వర్షం దున్నలకు మాదిగలకు, ఆముదాలకు బలము

3117 విశిరినమ్మకు బొక్కినదే కూలి

3118 విశ్వాసం వున్నవాళ్ళకు చత్వారం వుంటుంది

3119 విషపాలకు విత్తు నేపాళపు గింజ

3120 విషపుంజము

3121 విషములోం పుట్టిన పుంజుకు విషము ఆహారము

3122 విస్తరి యెత్తమంటే భోంచేసిందెందుకు అన్నట్లు

3123 విస్తరి కొదువా సంసారం కొదువా తేర్చేవారు లేదు

3124 విస్సన్న చెప్పింది వేదం

వీ

3125 వీసంగల రెడ్దికి విడన ముడనా సరి

3126 వీసం యిచ్చి వాసానికి వొడ్డే వాదు

3127 వీసానికి వాసన్నర అయితే దూలన్నత యెంత