పుట:Lokokthimukthava021013mbp.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3012 వండని అన్నం వడకని బట్ట

3013 వండాలేనమ్మకు పప్పులు మెండు తేలేనమ్మకు తిండి మెండు

3014 వండవే పెండ్లికూతురా అంటే కుండ తీసుకొని నీళ్ళకు వెళ్లుతా నందిట

3015 వండిన కుండలోదొక మెతుకే పట్టి చూ'దటం

3016 వండుతూ వుండగా వాంతి వస్తున్నదంటే వుండి భోజనం చేసి పొమ్మనదట

3017 వంశ మెరిగి వనితను వన్నె యెరిగి పశువును కొనవలెను

3018 వంశ మో వాడాలి తోకో

3019 వగచినట్టూ వుండవలె వాత బెట్తినట్టూ వుండవలె

3020 వగల్ చేసేదెందుకు డబ్బు దొభ్భే టందుకు

3021 వగల మారి వంకాయ శగలేకనే సగమయింది

3022 వగ్గు కోతికి సివము వచ్చింట్లు

3023 వచ్చిన ఖర్మం వద్దంటే పోతుందా

3024 వచ్చిన దోవనె పోతుంది

3025 వచ్చిన వాదు చచ్చినా పోదు

3026 వచ్చిన వారికి వరమిస్తాను రానివారికి రాయివేస్తాను

3027 వచ్చీ రాని మాటలు వూరీ వూరని వూరగాయ రుచి

3028 వచ్చు కీడును వాక్కే చెప్పును

3029 వచ్చే కాలం కన్నా వచ్చిన కాలం మేలు

3030 వచ్చేదల్లా రాని పోయేదెల్లా పోనీ

3031 వచ్చేవారికి స్వాగతం, పోయేవారికి ఆశామాంతం

3032 నట్టింటికి పోచిళ్లు చల్లినట్లు