పుట:Lokokthimukthava021013mbp.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2967 లంకలో పుట్టిన వారెల్లా రాక్షసులే

2968 లంచము పెట్టినదిమాట పుంజము పెట్టినది బట్ట

2969 లంజకు పిల్ల తగలటం

2970 లంజకొడుకు తండ్రికి తద్దినం పెట్టినట్లు

2971 లంజచెడి యిల్లాలైల్నది

2972 లంజ పితాళ్ళకు పెట్టి ఆకాశం చూచినట్లు

2973 లంజబిడ్డకు తండ్రియెవరు

2974 లంజలు లేకపోతే గుడేరంజిల్లును ప్రజల మనస్పూరంజిల్లును

2975 లక్కసాసొసులు తొడుకొని లటలట పోతావుగాని వాకిలి యెవడు నూకు తాడోయి వన్నెకాడ

2976 లక్షణాలుగల బావ గారికి రాగిమీసాలు అవలక్షణాలు గల బావగారికి అవీలేవు

2977 లక్ష నక్షత్రాలైనా ఒక చంద్రుడు కాడు

2978 లడాయి అంటే వెనుకకు పోతాడు అన్నమంటే ముందుకు పోతాడు

2979 లక్షణం చెడితే అవలక్షణం

2980 లడాయి వచ్చినప్పుడా కత్తులు చేసుకోవడం

లా

2981 లాభము గూబల్లోకి వచ్చినది

2982 లాభములేనిది పెట్టి యేటపడడు