పుట:Lokokthimukthava021013mbp.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2762 ముది ముప్పున అంగిట ముల్లు

2763 ముదిరి చచ్చినా యెండి విరిచినా వగవు లేదు

2764 ముదురున వేసినపైరు ముదిమి పుట్టిన కొడుకు

2765 ముద్దుచేసి కుక్కమూతికరచను

2766 ముద్దున పేరుచెడె మురిపాన నడువుచెడె

2767 ముద్దుముఖము గరుడసేవ

2768 ముద్దులు గులకరా ముదిపెండ్లి కొడకా అంటే పెండ్లి కొచ్చిన పేరంటాండ్రందరు నాపెద్దపెండ్లాలే అన్నాడట

2769 మున్నూటి కులానకు ముప్పూ లేదు మొండి కాలికి చెప్పూలేదు

2770 మున్నూరుసిఖలైనా కూడవచ్చునుగాని మూడుకొప్పులు కూడరాదు

2771 ముప్పదియేండ్ల ఆడుది మూడేండ్లమగవాడు ఒకటి

2772 ముప్పదియేండ్లు కష్టమనుభవించినవాడు లేడు

2773 ముఫ్పైమూడుకోట్ల దేవతలు ముక్కుపట్టించగలరుగాని నారాయణా అని అనిపించగలరా

2774 మురదన్న సందేహం నిస్సందేహం

2775 మురిపెము తిరిపెముచేటు ముసలిమగడు ప్రాణమునకు చేటు

2776 మురిపెమునకు మూడునల్లపూసలు కొలికకు ఒక తిరుగట్రాయి

2777 ములక కాయకు తగినముండ్లెప్పుడున్నవో కాకరకాయకు తగినగరుకు లప్పుడేవున్నవి