పుట:Lokokthimukthava021013mbp.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2695 మఖ పుబ్బలు వరపైతే మహత్తరమైన కాటకం

2696 మఖలో పుట్టి పుబ్బలోపోయినాడు

2697 మఖవురిమితే మదురుమీద కర్రయినాపండును

2698 మఖ్ఖీకి మఖ్ఖీ

2699 మగడువల్లనమ్మను మారీవల్లదు

2600 మగవానిబ్రతుకు చిప్పనిండమెతుకు ఆడదానిబ్రతుకు గంజిలో ఒక మెతుకు

2601 మగ్గానికి ఓక రాయి మరవకుండా పట్టండి

2602 మజ్జికకువచ్చి ముంతదాచినట్లు

2603 మట్టిగుర్రాన్ని నమ్మి ఏట్లో దిగినట్లు

2604 మట్టితిన్న పాము

2605 మట్టియెద్దైయినా మాయెద్దే గెలవాలి

2606 మట్టిగడ్డలో కప్పకూస్తే ఒకఝాముకు వర్షము

2607 మట్టుమీరిన మాటకు మారులేదు

2608 మడికి గట్టు యుఇంటి గుట్టుమంచిది

2609 మడిదున్ని మహారాజైనవాడు చేనుదున్ని చెడినవాడు లేడు

2610 మడిని పడ్డనీరు పైబడ్డ దెబ్బ పోనేరదు

2611 మడిబీద రైతుబీద

2612 మడ్డిముండకు మొగలిపూలిస్తే మడిచి ముడ్డిలోపెట్టుకుందిట

2613 మణులు చెక్కిన సంకెళ్ళు

2614 మణి మణితో కొయ్యవలెను