పుట:Lokokthimukthava021013mbp.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2573 మంచికాలానికి మామెళ్లు చెడ్డకాలానికి చింతలు

2574 మంచికిపోగా చెడ్డ యెదురైనట్లు

2575 మంచిజేసిన ముంగికి మరణం యెదురైనట్లు

2576 మంచిప్రాణానికి మండలంవరకు భయంలేదు

2577 మంచిమంచిఅంటే మదురెక్కి నాట్యమాడెనట

2578 మంచివానికి మాట్లాడనిదే మందు

2579 మంచివానికి మరణమెసాక్షి

2580 మంచివానికేవచ్చెనా మరణకాగితం

2581 మంచివానికి మాటేమందు

2582 మంచివారికొక మాట మంచిగొడ్డుకొకదెబ్బ

2583 మంత్రంచెప్ప మల్లిభొట్లూ తినడానికి ఎల్లిభొట్లు

2584 మంత్రములేని సంధ్యకు మరిచెంబెడు నీళ్లు

2585 మంత్రము లోపములెకున్నా తుపర్లకు లోటులేదు

2586 మంత్రసానిముందర మర్మముదాచినట్లు

2587 మంత్రాలకు మామిడికాయలు రాలునా

2588 మందినిముంచి మసీదుకట్తినట్లు

2589 మందియెక్కువైతే మజ్జిగపల్చన

2590 మందుకుపోయినవాడు మాసికమునకు వచ్చును

2591 కందూలేదు గుండూలేదు తుపాకిబెట్తికాల్చు

2592 మక్కాకుపోయి కుక్కమలం తెచ్చినట్తు

2593 మఖకు మానికంతచెట్టయితే కార్తీకమునకు కడవంత గుమ్మడికాయ కాసును

2594 మఖాపంచకం సదాపంచకం