పుట:Lokokthimukthava021013mbp.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

29. అందులో పసలేదు, గంజిలో వార్చమన్నట్లు

30.అంధునకు అద్ధము చూపెనట్లు

31.అంబటికి ఆశ మీసాలకు ఆశ

32.అంబటియేరు వచ్చినది అత్తా అంటే కొలబుర్ర నాచేతిలో ఉన్నది కొడలా అన్నదట

33.అంబలి తాగేవారికి మీసాలు యెగబట్టేవారు కొందరా

34.అందము చందము లేనివాడు సందెకావలి పోయినాడు

35.అకట వికటపు రాజ, అవివేక ప్రధాని, చాదస్తపు పరివారము

36.అక్కన్న మాదన్న గార్లు అందలమెక్కితే సాటిసరప్ప చెరువుకట్ట యెక్కినాడట

37.అక్క మనది అయితే బావ మనవాడా?

38.అగడ్తలోపడ్డ పిల్లికి అదే వైకుంఠము

39. అగ స్త్యభ్రాత

40.అగ్నికి జల్లదనము వచ్చినట్లు

41.అగ్నిలో నొకకాలును గంధములో నొకకాలును ఉంచి తగవుతీర్చినట్లు

42.అగ్నిలో మిడుత పడ్డట్లు

43.అగ్నికి వాయువు సహాయమైనట్లు

44.అగ్ని శేషము, ఋణశేషము, వ్రణ శేషము, శత్రుశెషము, నుంచరాదు.