పుట:Lokokthimukthava021013mbp.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2440 బంగారు ముచ్చెలైనా కాళ్ళనే తొడగవలెను

2441 బంగుతిన్న కోతివలె తిరుగుతాడు

2442 బండి దొంగిలికము

2443 బండియెద్దు అమ్మినవానిబ్రతుకు బంది

2444 బంధువుండవు సరేగాని పైరులో చెయ్యి పెట్టవద్దు

2445 బక్కవానికి బలసినవాడు బావ బలసినవానికి బక్కవాడు బావ

2446 బగబగ మనువాని పంచను వుండవచ్చునుగాని ముచ్చువాని పంచను వుండరాదు

2447 బట్టతలకు పేలుపట్టినట్లు

2448 బట్టతలకు మోకాళ్ళకు ముడివేసినట్లే వున్నది

2449 బట్టప్పు పొట్టప్పు నిలవదు

2450 పడాయిబచ్చె కూడులేక చచ్చె

2451 బడాయికి బావగారువస్తే యీడవలేక యింటిల్లిపాది చచ్చిరి

2452 బడాయి బారెడు పొగచుట్ట మూరెదు

2453 బడాయికి బావగారాఅంటే యేమె గుడ్దికంటి మరదలా అన్నట్టు

2454 బడిఒలెని చదువు వెంబడిలేని సేద్యము కూదదు

2455 బడేసాయిబు జోశ్యులూ తొలియేకాదశెన్నడు

2456 బడేసాయిబు గడ్దము బారెడై తేనేం మూరడైతేనేమి

2457 బయటతన్ని యింట్లో కాళ్లుపట్టుకున్నట్లు

2458 బరిగపంట కడుపుమంట