పుట:Lokokthimukthava021013mbp.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2224 పితికేబర్రెను యిచ్చి పొడిచే దున్నను తెచ్చుకున్నట్లు

2225 పినతండ్రి పెళ్ళాం పినతల్లి గాదు, మేనమామ పెళ్లాము మేనత్తగాదు

2226 పిరికి బంటుకు తుమాన్ఖ

2227 పిరికి బంటుకు ఆయుధ మెందుకు

2228 పిలవని పేరంటం, చెప్పని ఒక్కపొద్దు

2229 పిలిస్తే బిగిస్తే సరిగాని వస్తే వాడబ్బతరమా

2230 పిల్లకా కేమెరుగును వుండేలు దెబ్బ

2231 పిల్లకాయలకు పీట కోళ్లకు చలిలేదు

2232 పిల్ల బావిలో పడ్డదిరా అంటే వుదుకంబలి తాగిస్తా నన్నాడట

2233 పిల్ల ముడ్దిగిల్లి వుయ్యాల వూపేవాడు

2234 పిల్లగలవాడు పిల్ల కేడిస్తే కాటివాడు కాసుకేడిచినట్లు

2235 పిల్లకు సొమ్ముబెట్టిచూడు గోడకు సున్నం పెట్టిచూడు

2236 పిల్ల కోసరం గడ్డి తింటాడు

2237 పిల్ల లేనియింట తాత తడువు లాడినట్లు

2238 పిల్లి కండ్లు మూసుకొని పాలు త్రాగుతూ ఎవరున్నూ చూడలేదను కొన్నట్లు

2239 పిల్లి కండ్లు పోగోరును, కుక్క పిల్లలు గలుగ గోరును

2240 పిల్లికి చెలగాటము, ఎలుకకు ప్రాణ సంకటము

2241 పిల్లితోక బర్రె త్రొక్కితే పిల్లి ఎలుక మీద మీసాలు దువ్వెనట