పుట:Lokokthimukthava021013mbp.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెనుగు సామెతలు

1.అంగటి వీధిలో అబ్బాఅంటే ఎవరికి పుట్తినావురా కొడకా అన్నట్టు

2.అంగటి వీధిలో ఆలిని పడుకోపెట్టి వచ్చేవారు పొయేవారు దాటిపోయినా రన్నట్టు

3.అంగట్లో అన్నీ వున్నవి అల్లుని నోట్లో శనివున్నది.

4.అంగిట బెల్లము ఆత్మలో విషము

5.అంగట్లో బెల్లము గుళ్ళోలింగానికి నైవేద్యము

6.అంగిట విషము మున్నాలికను తియ్యదనము

7.అంటక ముట్టక దేవరకు పెడుతున్నాను. ఆశపడకండి బిడ్డలారా, ఆవలికి పొండి అన్నదట

8.అంటా ముట్టరాని ఆగ్రహారము

9.అంటూ సంటూ ఆసాది వానిది రట్టూరవ్వా గంగానమ్మది

10.అంటూ సంటూ లేని కొడలి దాని మేనమామ కొడుకు చిక్కుడు చెట్టుక్రిందికి పోయి పక్కలు యెగరవేసినాడట