పుట:Lokokthimukthava021013mbp.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2128 పనిలేక పటేలింటికిపోతే పాతగోడకు వూతపెట్టమన్నాడాట

2129 పనిలేని పాపరాజేమి చేస్తునాడురా అంటే, కుందేటి కుమ్ముకు రేశాలు తీస్తున్నాడు

2130 పనిలేని మంగలి పిల్లితల గొరికినట్లు

2131 పనిలెని మాచకమ్మ పిల్లిపాలు పితికిందట

2132 పన్నెండామడలమధ్య బ్రాహ్మడుడు లేకపోతే యజ్ఞం చేయిస్తానన్నట్లు

2133 పప్పణ్ణంఅంటే పది ఆమడలైనా పరుగెత్తాలె

2134 పప్పుతో పది కబళాలూ తింటే వులుపెందుకు బుగ్గిలోకా

2135 పప్పులేని పెండ్లి పప్పులేని కూరవున్నదా

2136 వరద్రవ్యాణి లోష్టవతు

2137 పరద్రవ్యాణి చెల్లంవత్

2138 పరాయి పిల్లలకు గాజులు పెట్టితే పకాలుచేటు

2139 పరుగెత్తుతూ పాలుతాగెకన్న నిలబడి నీళ్లు తాగేదిమేలు

2140 పరుగేత్గ్తేవాణ్ణి చూస్తే తరిమేవాడికి లోకువ

2141 పరులసొమ్ము పేలపిండి, తనసొమ్ము దేవుడిసొమ్ము

2142 పరువిచ్చి పరువు తెచ్చుకో

2143 పలుకనివాళ్ళతో పదివూళ్ళవాళ్లూ గెలువలేరు

2144 పలకమ్మ పున్నానికి (మార్గశిరము) పడమటి కొమ్మ పూస్తుంది

2l45 పలుచని పంట వేడుక, బత్తుచూపు వేడుక

2146 పల్లం వుంటే నీళ్ళు నిలుస్తవి

2147 పల్లందున్నినవాడు పల్లకీ యెక్కినవాడు సమము