పుట:Lokokthimukthava021013mbp.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1951 నిద్రపోయేవాణ్ణి లేపవచ్చునుగాని మేలుకున్నవా ణ్ణేవరు లేపుతారు

1952 నిద్రపోయినవాడి కాళ్ళకు మ్రొక్కినట్లు

1953 నిద్ర సుఖమెరుగదు ఆకలి రుచియెరుగదు

1954 నిన్న కుప్పా యివ్వాళ ఆళ్లు

1955 నిన్నవున్నవారు నేడు లేరు

1956 నిప్పుకు చెదలంటునా

1957 నిప్పుకు నీళ్ళకూ వుండే స్నేహం

1958 నిప్పుకు నీళ్ళంటుకొనునా

1959 నిప్పుకొట్టితే నీళ్లవునుగాని నీళ్ళుకొట్టితే రెండగునా

I960 నిప్పునకాలదు నీళ్ళను తడవదు

1961 నిప్పుముట్టనిది చెయ్యికాలదు

1962 నిప్పులబుర్రకు నీళ్ళబుర్ర

1963 నిప్పులు వళ్ళోకట్టుకున్నట్లు

1964 నిమ్మకు నీరెత్తినట్లు

1965 నిర్భాగ్యునికి నిద్ర అభాగ్యునికి ఆకలి

1966 నిలకడలేనిమాట నీళ్ళమూట

1967 నిలునీడ పట్టుకొమ్మాలేదు

1968 నిలుచుంటానికి జాగాదొరికితే కూర్చుంటానికి అప్పుడే దొరుకుతుంది

1969 నివురుకప్పిన నిప్పు

1970 నిశ్చితార్ధమునాడు నీలగవలసినది నాగవల్లిదాకావుండడం నాఅదృష్టమే కదా