పుట:Lokokthimukthava021013mbp.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1873 నడమంత్రపుదాసరి పొద్దుమానం యెరుగడు

1874 నడమంత్రపుశిరి నరాలమీద కురుపు

1875 నడవలేనమ్మకు నాలుగుపక్కలా సవారి

1876 నడిచేకొద్ది డొంక, పెట్టేకొద్దీ కుదురు

1877 నత్తగుల్లలన్నీ ఒకరేవున ముత్యపుచిప్పలన్నీ వొకరేవున

1878 నత్తగుల్లలన్నీ ఒకచోట నవరత్నాలన్నీ ఒకచోట

1879 నన్ను నేనే యెరుగను నిన్ను నేనేమి యెరుగుదును

1880 నపుంసకునిచెంత నవలాసరసత్వము

1881 నమలగూడని నారికేళము

1882 నమాజు చెయ్యబోతే మసీదు మడనుబడింది

1883 సమ్మితి తెమ్మన్నా అంటే నాఅంతవాణ్ణి చేస్తానన్నట్లు

1884 నమ్మి నడివీధిలో పోసినవారెవరు

1885నమ్మి నానబోసితే పులిసి బుర్రటలాయెను

1886 నమ్మినాను రామన్నా అంటే నట్టేట ముంచుతాను లక్ష్మన్న అన్నాడట

1887 నరములులేని నాలుక నాలుగు విధాలు

1888 నరుల్నికంట నల్లరాయిపగులును

1889 నలభీమపాకం

1890 నలుగురితోపాటు నారాయణ కులందోపాటు గోవింద

1891 నల్ల మొగులు వానగొట్టదు నవ్వుమొగమువాడు దానముచెయ్యడు

1892 నల్లినలిగిపోయినది చెత్తకానము

1893 నల్లినిగూర్చి మంచానికిపెట్టు