పుట:Lokokthimukthava021013mbp.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1856 నంగి వంగలు మేస్తే నారికేళాలు దూడలు మేసినవన్నట్లు

1857నంగీ నమలక మ్రింగవేఅంటే వుడికినచేపలు కరుస్తవన్నదట

1858 నందిఅంటే నంది పందిఅంటే పంది

1859 నంబిపెట్టినదే ప్రసాదం

1860 నంబి, దంబళీ, నాగుపాము చెవులపిల్లి యెదురై తేచేటు

1861 నంబీనంబీ యేంసహాయం చేస్తావంటే నీపెండ్లి కెదురగా రానులే అన్నాడట

1862 నక్కకూసి పిల్లలకు దారితెస్సును

1863 నక్కకూసి నాశం తెచ్చును

1864 నక్కను చూచివాడెల్ల వేటకాడే

1865 నక్కజిత్తులన్ని నావద్దవుండ నన్ను మోసముచేసె తాబేటిబుర్ర

1866 నక్కపోయిన వెనుక బొక్క కొట్టుకున్నట్లు

1867 నక్కయెక్కడ దేవలోకమెక్కడ్

1868 నక్క రేలకాయ సామ్యం

1869 నక్కలెరుగని బొక్కలు నాగులెరుగుని పుట్టలూవుండునా

1870 నక్కవాత మన్నుకొట్టినాడు

1871 నక్కానక్కా నానామం చూడు తిరిగిచూస్తే తిరుమణిచూడు

1872 నట్టేట పుట్టి ములిగినట్లు