పుట:Lokokthimukthava021013mbp.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1801 దేవుడి పెండ్లికి అందరు పెద్దలే

1802 దేవుడిస్తాడుగాని వండివార్చి వాతబెట్టునా

1803 దేవుడు వరమిచ్చినా, పూజారి వరమివ్వడు

1804 దేహం నీటిబుగ్గ వంటిది

1805దేహి అంటే నాస్తి అనరాదు

దొ

1806 దొంగకు అందరిమీద అనుమానమే

1807 దొంగకు దొంగబుద్ధి దొరకు దొరబుద్ది

1808 దొంగకు దొరికిందేచాలు

1809 దొంగగొడ్లకు గుది కర్రవేసినట్లు

1810 దొంగ చిక్కెనోయీ అంటే కరిచేవోయి అన్నట్లు

1811 దొంగ చెయ్యి దాచిపెట్టినా అమావాస్యనాడు అల్లల్లాడుతుంది

1812 దొంగతోకూడా దయ్యం వెంబడె వచ్చును

1813 గొంగను తేలు కుట్తినట్లు

1814 దొంగను దొంగ యెరుగును

1815 దొంగను పుట్టించినవాడు మతిభ్రష్టును పుట్టించక మానడు

1816 దొంగల తల్లికి యేడ్వ భయం

1817 దొంగలబడ్డ ఆరుమాసములకు కుక్కలు మొరిగినవి

1818 దొంగలుతోలిన గొడ్దు యే రేవున దాటినా ఒకటే