పుట:Lokokthimukthava021013mbp.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తె

1657 తెంపులతాళ్ళు చిల్లుల కడవ

1658 తెగించి దానము చేస్తాను తేరా పిడికెడు ఆళ్ళు

1659 తెగించినవానికి తెడ్డేఆయుధం

1660 తెగోదారికి తేలుకుట్టితే తల్లవార్లూ కోడికూసిందట

1661 తెగినచేను తేమఓర్చును

1662 తెగించి వెనుకకుపోయినంత తెలివితక్కువలేదు

1663 తెచ్చుకుంటే భోంచేయి జగన్నాయకా లేకుంటె వూరకుండు జగన్నాయకా

1664 తెడ్డునకు పారగుణము తెలియునా

1665 తెడ్డునాకి వుపవాసాలు మానినట్లు

1666 తెడ్డుయేదీ అంటే కొయ్యయేదీ అన్నట్లు

1667 తెడ్డువుండగా చెయ్యికాల్చుకున్నట్లు

1668 తెలికెలవాడి ముడ్దికిందరాయి

1669 తెలివితక్కువ ఆకలెక్కువ

1670 తెలిసి తెలిసి బొందనుపడ్డట్లు

1671 తెలిసినారికి ముందరేవున్నదిమోక్షం

1672 తెలిసేవరకు బ్రహ్మవిద్య తెలిస్తే కూసువిద్య

1673 తెల్లపూలుపండితే తెల్లజొన్నలు బలుసుపండ్లు పండితే పచ్చజొన్నలు పండును

1674 తెలిసినవారి కంతలోవున్నది

1675 తెల్లగావుంటేపాలు నల్లగావుంటేనీళ్ళు