పుట:Little Masters Sulabha Vyakaranamu.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

96

ఉదా : - చెఱువునుదకము
         రాజుముదల
         తెల్ల పద్మము.

మంచి బాలుడు మొదలైనవి. మిశ్రమ సమాసమనుట వలన కేవలము సంస్కృత శబ్దములకు, ఆచ్చిక పదములకు, సమాసము చేయరాదు.

అనేకమారులు -ఘృత గిన్నె అని అనరాదు.

సమాసములోని, పదముల ప్రాధాన్యతను బట్టి, సమాసములు నాల్గు విధములుగ విభజింపవచ్చును. అవి:

1) పూర్వపద ప్రాధాన్యము కలవి - ద్విగు సమాసములు
2) ఉత్తర పద ప్రాధాన్యము కలవి - తత్పురుష సమాసములు
3) ఉభయ పద ప్రాధాన్యము కలవి - ద్వంద్వ సమాసములు
4) అన్యపదార్ద ప్రాధాన్యము కలవి - బహువ్రీహి సమాసములు


అర్ద భేదమును బట్టి సమాసములు
అర్ద భేదమును బట్టి సమాసములు ఆఱు విధములు.

అవి :
1) తత్పురుష సమాసము
2) కర్మధారయ సమాసము
3) ద్విగు సమాసము
4) ద్వంద్వ సమాసము
5) బహువ్రీహి సమాసము
6) అవ్యయీ భావ సమాసము

1. తత్పురుష సమాసము

ఉత్తర పదార్ధము ప్రధానముగా గలది తత్పురుష సమాసము. రామ బాణము - ఇందు పూర్వపదము రామ - ఉత్తరపదము బాణము. రామ బాణముతో చంపెను. అనగా ఇందు బాణము ప్రధానము. క్రియతో సంబంధము కలిగియుండును. మొదటి

సులభ వ్యాకరణము