పుట:Little Masters Sulabha Vyakaranamu.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

95

అవి రెండును వేర్వేరు అర్ధబోధకములైనప్పటికి, సమసింపబడి ఒకే అర్ధమును తెల్పుచున్నవి. రామ - బాణము - ఇందు మొదటి పదమును పూర్వపదమని - రెండవ పదమును, ఉత్తర పదమనియు అందురు.

సమాసము-భేదములు

శబ్దమును అనుసరించి సమాసములు మూడు విధములు.

అవి :
       1) సాంస్కృతికము
       2) ఆచ్చికము
       3) మిశ్రమము

సాంస్కృతిక సమాసము
       సాంస్కృతికము మరల రెండు విధములు.
సిద్ద సమాసము - సాధ్య సమాసము

       కేవల సంస్కృత పదములు సంస్కృత వ్యాకరణము ననుసరించి, సమసింపబడినవి సిద్ధ సమాసములు.

ఉదా : - రాజపుత్రుడు
         రాజాజ్ఞ
         తటాకోదకము.

తత్సమపదములతో, నేర్పడిన, సమాసము సాధ్య సమాసము.
రాజునాజ్ఞ - తటాకంబు నుదకము


ఆచ్చిక సమాసము

అచ్చ తెలుగుపదములతో నేర్పడు సమాసము.

ఉదా : - చెఱువునీరు - ఱేనియానతి
        సిరి చెలువుడు - కుంతి కొడుకు మొదలైనవి.

మిశ్రమ సమాసము : - తత్సమ ఆచ్చిక పదములతో నేర్పడు సమాసము.

సులభ వ్యాకరణము