పుట:Little Masters Sulabha Vyakaranamu.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

91

పూర్వపద ముపమావాచకమై, యుత్తర పదముగా మేను శబ్దమున్నచో, ఆ మేను శబ్దమునకు పోడియను నదాదేశముగ వచ్చును.

       అలరు + మేను = అలరుబోడి
       నన + మేను = ననబోడి
       పూ + మేను = పూబోడి
       విరి + మేను = విరిబోడి.

19. లు-ల-న ల సంధి :

లు-ల-నలు పరంబగునపుడు డొకానొకచో, ముగాగమంబునకు లోపంబును తత్పూర్వస్వరంబునకు, దీర్ఘంబును విభాషణగు లు-ల-నలు పరమగు నపుడు, ఆగమమైన 'ము' వర్ణమునకు కొన్ని చోటుల లోపమును దానికి ముందున్న అచ్చునకు దీర్ఘమును వికల్పముగా వచ్చును.

        వజ్రము + లు = వజ్రాలు
        వజ్రము + ల = వజ్రాల
        వజ్రము + న = వజ్రాన
        పగడము + లు = పగడాలు
        పగడము + ల = పగడాల
        పగడము + న = పగడాన

20. అపదాదిస్వరసంధి :

అందు అవగాగమంబు లందప్ప, నపదాది స్వరంబు పరంబగునపుడు అచ్చునకు సంధియగు.

సులభ వ్యాకరణము