పుట:Little Masters Sulabha Vyakaranamu.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

89

అట్లే తొంబదిలోను రూపములు గ్రహించునది.

నిండు + వెర = లో - ని మిగిలి - వెరపరము కాగా, మీది హల్లునకు ద్విత్వము వచ్చి ని + వ్ + వెర = నివ్వెర అయినది. అట్లే తక్కిన రూపము లెరుగునది.

16. పడ్వాదేశసంధి :

పడ్వాదులు, పరంబగునపుడు, ము వర్ణమునకు లోప, పూర్ణబిందువులు, విభాషనగు.

       భయము + పడె - భయపడె
                      భయంపడె
                      భయముపడె
       సూత్రము + పట్టె - సూత్రపట్టె
                      సూత్రం పట్టె
                      సూత్రముపట్టె.

పడ్వాదులు - పడు - పెట్టు - పెట్టు మొ..నవి. ఈ కార్యము కర్తృవాచి ము వర్ణమునకు కలుగదు.

గజముపడియె - అశ్వము పడియె. పడు - మొదలగునవి. పరంబగునపుడు ప్రథమా విభక్తి ప్రత్యయముగల, ము వర్ణమునకు లోపముగాని, పూర్ణ బిందువుగాని వికల్పముగా వచ్చును. భయము + పడె = భయపడె. ము వర్ణము లోపించినది. పూర్ణ బిందువు రాగా భయంపడె రూపము కల్గును. ఈ లోప - పూర్ణ బిందువులు రానిచో భయముపడె అని లోపముకాని రూపమే యుండును. ఇట్లే రెండవ ఉదాహరణము గ్రహించునది. ఈ ము వర్ణలోపము కర్తను

సులభ వ్యాకరణము