ఈ పుట ఆమోదించబడ్డది
69
వర్గ తృతీయాక్షరాలు : గ జ డ ద బ
వర్గ చతుర్థాక్షరాలు : ఘ ఝ ఢ ధ భ
వర్గ పంచమాక్షరాలు : ఙ ఞ ణ న మ
మనః + గతము :
మన + ః + గతము
మన + ఉ + గతము, (గుణము)
మనోగతము.
ఇదే సూత్రమును ఈ క్రింది విధముగా కూడ చెప్పవచ్చును.
విసర్గమునకు కఖ పఫలుగాక మిగిలిన కలిగిన హల్లులుగాని అచ్చులుగాని పరమగునప్పుడు ఓ కారము వచ్చును.
దుః + ఉదరము = దురోదరము
తపః + వనము = తపోవనము
శిరః + రత్నము = శిరోరత్నము
మనః + హరము = మనోహరము
అన్యః + అన్య = అన్యోన్య
పయః + ఘృత = పయోఘృత
శిరః + మణి = శిరోమణి
రజః + రాగము = రజోరాగము
3. పూర్వమున అకారాద్యచ్చులు గల సకారాంత శబ్దములకు, వర్గ ప్రధమ, ద్వితీయాక్షరములు, శషలుగాక మిగిలిన హల్లులు అచ్చులు పరమగునప్పుడు రేఫము ఆదేశమగును.
సులభ వ్యాకరణము