64
ఉదా : సుర + ఇంద్ర = సురేంద్ర (అ+ఇ) = ఏ
రమా + ఈశ = రమేశ (ఆ+ఈ) = ఏ
రాజ + ఉత్తమ = రాజోత్తమ (అ+ఉ) = ఓ
గంగా + ఉదకము = గంగోదకము (ఆ+ఉ) = ఓ
దేవ + ఋషి = దేవర్షి (అ+ఋ) = అర్
మహా + ఋషి = మహార్షి (ఆ+ఋ) = ఆర్
ఇది ఏకాదేశ సంధి.
3) వృద్ధి సంధి :
ఐ - ఔ - అర్ అను వర్ణములు వృద్ధులు. వీని వలన ఏర్పడిన సంధి వృద్ధి సంధి.
అకారమునకు ఏ - ఐ లు పరమగునపుడు ఐకారమును, ఓ - ఔలు పరమైనపుడు ఔ కారమును వచ్చును. ఋకారము పరమైన అర్ - ఏకాదేశమగును.
అ + ఏ = ఐ ----- అ + ఐ = ఐ
అ + ఓ = ఔ ----- అ + ఔ = ఔ
అ + ఋ = అర్. ఉదా : లోక + ఏక = లోకైక (అ + ఏ = ఐ)
సకల + ఐశ్వర్య = సకలైశ్వర్య (అ + ఐ = ఐ)
పావ + ఓఘ = పాపౌఘ (అ + ఓ = ఔ)
రమా + ఔదార్య - రమౌదార్య (అ + ఔ = ఔ)
ఋణము (అప్పు అను అర్దము) అనుపదము పరమైన అర్ వచ్చును. కావున నిది వృద్ధిసంధిగా గుర్తించవలెను.
సులభ వ్యాకరణము