ఈ పుట ఆమోదించబడ్డది
61
రుగాగమ - టుగాగమ - నుగాగమ - దుగాగమ సంధులు ఈ కోవకు చెందినవి.
2. ఆదేశ సంధులు
సంధిలోని పూర్వపర పదముల మధ్య గల ఒక వర్ణమును తొలగించి, దాని స్థానమున మరియొక వర్ణము శత్రువు వలె వచ్చిచేరుట ఆదేశ సంధి.
అతి + అంతము =
అతి + య్ + అంతము = అత్యంతము
అత్ + ఇ + య్ + అంతముయణా దేశ పుంప్వా దేశ సంధులు ఈ కోవకు చెందినవి.
3. ఏకాదేశ సంధులు
సంధిలోని పూర్వపర పదముల నడుమగల రెండు వర్ణములను తొలగించి, ఆ రెంటింటి స్థానమున ఒకే వర్ణము వచ్చి చేరిన దానిని ఏకాదేశసంధి అందురు.
సులభ వ్యాకరణము