పుట:Little Masters Sulabha Vyakaranamu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42

యలు నాలుగు కాకా తక్కిన ధాతువులు కొన్ని చేరి అర్ద భేదము కలిగించును. అవి శబ్దపల్లములు. నిలుచుండు - కూరుచుండు - చొప్పడు - ఆకొను - ఈకొను - అలవడు - ఏరుపడు - తలపోయు - విజయంచేయు - పరుండు - మేలుకొను మొదలైనవి.

కార్యమును బట్టి సమాపక క్రియలు - అసమాపక క్రియలు అని రెండు రకములు.

సంపూర్ణాభిప్రాయమును దెల్పునవి సమాపకక్రియలు.

కృష్ణార్జునులు ఖాండవ వనమును దహింపజేయించిరి. - ఇట చేయించిరి అనునది సమాపకక్రియ.

సంపూర్ణాభిప్రాయమును తెలుపనివి అసమాపకక్రియలు.


కృష్ణార్జునులు అగ్నిదేవునికి సహాయపడి, ఖాండవ వనము దహనము చేయించిరి. ఇటు సహాయపడి - అనునది అసమాపకక్రియ.

ప్రతి ధాతువునకు నాలుగేసి కాలములు - మూడేసి పురుషములు - రెండేసి వచనములుండును.

జరుగుచున్న కాలబోధకము వర్తమానకాలము

- బ
ప్ర -చదువుచున్నాడు
-చదువుచున్నది
-చదువుచున్నారు.
-చదువుచున్నవి.
-చదువుచున్నావు -చదువుచున్నారు.
-చదువుచున్నాను -చదువుచున్నాము.

సులభ వ్యాకరణము