పుట:Little Masters Sulabha Vyakaranamu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

41

తత్సమక్రియలు. ఉదా : కోపించు - స్రవించు - తపించు - వచించు - జయించు - భుజించు - భాగించు - మొదలైనవి.

అచ్చ తెలుగువి దేశ్య క్రియలు :

వచ్చు - పోవు - చదువు - తిను మొదలైనవి.

ఉపయోగమును బట్టి సహాయ క్రియలు - స్వతంత్ర క్రియలు - న్యూనక్రియలు అని క్రియలు మూడు రకములు.

కాలము మున్నగువాని నేర్పరుచుట యందు ఇతర క్రియలకు సాయపడునవి సహాయక్రియలు. వీనినే ఉపక్రియలందురు. ఇవి తెలుగున నాలుగు.

ఉండు - కలుగు - పడు - కొను అనునవి.
ఉండు - వచ్చియుండును, వచ్చియున్నాడు.
కలుగు - చదువకలిగెను, రాగలడు.
కొను - చదువుకొంటిని, వేడుకొందును.
పడు - భయపడెను, చేయబడును.

వీనికి స్వతంత్ర ప్రయోగము కూడ కలదు.

స్వతంత్రముగా ఉపయోగింపబడునవి స్వతంత్రక్రియలు. అవి : పోషించు - భుజించు - వచ్చు - పోవు మొదలైనవి.

కొన్ని కాలములందును - పురుషములందును మాత్రము ప్రయోగింపబడునవి న్యూనక్రియలు. ఇవి.

ఒల్లడు - వలయును - వలదు - కూడును - కూడదు - తగును - తగదు - మొదలైనవి.

కొన్ని ధాతువులకును - నామములకును సహాయక్రి

సులభ వ్యాకరణము