పుట:Little Masters Sulabha Vyakaranamu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

39

గ్రక్కునన్ - చయ్యనన్ - తటాలునన్ - తెప్పునన్ - తోడుతన్, తోడ్తోన్ - దాకన్ - దబ్బునన్ - ఫక్కునన్ - పెందలకడన్ - బొత్తిగన్ - మెట్టుకున్ - వలెన్ - వెంబడిన్ - సారెకున్ - అక్కటా, అయ్యో - ఆహా - ఊరక - ఓహో - ఔర - కదా - ఇంచుక - కొంచెము - ఇసుమంత - గోరంత - మడి - పదవడి - ఒకొ - అప్పుడు - ఇప్పుడు - ఎప్పుడు - రకము - అట్లు - ఇట్లు - ఎట్లు - కట్టా - కటకటా - ఏమి - ఏల - ఛీ - తలా - కరము - మునుకొని - హా - హోరాహోరి - కాని - కాబట్టి - మిక్కిలి - యు - ను - అను సముచ్చయములు.

ధాతువులనుండి పుట్టిన అవ్యయములను లాక్షిణికావ్యయములందురు.

(1) క్త్వార్దక (2) వ్యతిరేకక్త్వార్దక (3) శత్రర్దక (4) తుమర్దక (5) అనంతర్యార్దక (6) చేదర్దక రూపములను లాక్షిణికావ్యయములందురు. అవి.

చదివి క్త్వార్దకము
చదువక వ్యతిరేకక్త్వార్దకము
చదువుచున్ శత్రర్దకము
చదివింపన్ తుమర్దకము
చదివించుడున్ అనంతర్యార్దకము
చదివించినన్ చేదర్దకము

ఇవి చదువు అనుధాతువు నుండి పుట్టిన లాక్షణికావ్యములు.

సులభ వ్యాకరణము