పుట:Little Masters Sulabha Vyakaranamu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38

     చదువు బాలుడు
     చదివెడు బాలుడు
     చదివెడి బాలుడు

ఇందు చదువుచున్న - చదివిన - చదువగల - చదువని - చదువు - చదివెడు - చదివెడి అను నేడును చదువు ధాతువు నుండి పుట్టిన విశేషణములు. ఇట్లే ప్రతి ధాతువు నుండి ఏడేసి విశేషణములు పుట్టును.

v. క్రియాజన్య విశేషణములకు తచ్చశబ్దమును చేర్చుటవలన క్రియాప్రయుక్త విశేషణము లేర్పడును.

    ఉదా : - వచ్చినవాడు ఫల్గుణుడు.
            ఆడుచున్నవాడు పుష్కరుడు.
            దుమికెడివాడుత్తరుడు.

ఇందు వచ్చినవాడు - ఆడుచున్నవాడు - దుమికెడివాడు - అనునవి క్రియాప్రయుక్త విశేషణములు.

4. అవ్యయములు

లింగ, వచన, విభక్తులు లేని పదములు అవ్యయములు. ఇవి ప్రతిపదోక్తములు, లాక్షణికములు అని రెండు విధములు.

స్వతస్సిద్ధములైన అవ్యయములను ప్రతి పదోక్తములందురు.

అవి :- అంతటన్ - అదిగోన్ - అందులకున్ - ఇందున్ - ఇదిగోన్ - ఇందులకున్ - ఎందులకున్ - ఎట్టకేలకున్ - కడున్, కాబోలున్ - కాపుతన్ - కావునన్ - క్రచ్చరన్,

సులభ వ్యాకరణము