పుట:Little Masters Sulabha Vyakaranamu.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

37

వానికి పూర్వమందున్న కుబేరుడు - భీముడు అను శబ్దములకు విశేషణములు. ఇవి ద్రవ్యవాచకములయిన ధన - బల అను శబ్దములకు మతుబాదులు చేర్చుట వలన నేర్పడినవి. కాననివి ద్రవ్యప్రయుక్త విశేషణములు.

II. విధేయ విశేషములు : విశేష్యమును ముందు చెప్పి, విశేషణమును తరువాత చెప్పినచో అవిశేషణమును విధేయ విశేషమందురు.

ఉదా : రాముడు శూరుడు. లక్ష్మణుడు వీరుడు. బృహస్పతి బుద్ధిమంతుడు. ఇట శూరుడు, వీరుడు, బుద్ధిమంతుడు అను విశేషణములు. వాని విశేష్యములగు రాముడు - లక్ష్మణుడు - బృహస్పతి అనుశబ్దములకు తరువాత ప్రయుక్తములయినవి. అందువల్లనివి విధేయ విశేషణములు.

III. క్రియా విశేషణములు : క్రియల యొక్క గుణమును తెలుపునవి క్రియావిశేషణములు. గుణనామంబులకు చివర కాన్ - కన్ - అను వానిని చేర్చుట వలన ఈ క్రియావిశేషణము లేర్పడును.

ఉదా : వడిగా పరుగెత్తెను.

బిగ్గరగా అరచెను - ఇందు వడిగా, బిగ్గరగా అనునవి - పరుగెత్తెను - అరచెను అను క్రియలకు విశేషణములు.

IV. క్రియాజన్య విశేషణములు : ధాతువులనుండి పుట్టిన విశేషణములు క్రియాజన్య విశేషణములు.

ఉదా : - చదువుచున్న బాలుడు
        చదివిన పుస్తకము
        చదువగల బాలుడు
        చదువని బాలుడు

సులభ వ్యాకరణము