ఈ పుట ఆమోదించబడ్డది
26
అన్య దేశ్యములు
ఇతర దేశ భాషా పదములైయుండి కాలక్రమమున తెలుగు భాషా పదములలో కలిసి పోయినవి.
ఆంగ్లము : రైలు - టికెటు - కార్డు - పెన్ను.
హింది : దస్తావేజు - హాజరము
తమిళము : కెలసము - తిరుమణి - తిరుచూర్ణము.
గ్రామ్యము
లక్షణ - (వ్యాకర) విరుద్ధమగు భాష గ్రామ్యము. ఇది ప్రత్యేక భాష కాదు. దేశ్యము మొదలగు వాని అపభ్రంశమే గ్రామ్యము.
రామునికి - బదులుగా రాముడికి.
సంతోషము - బదులుగా సంతోషం అనుట గ్రామ్యమే.
కూ కో - లెగు - ఏంది - మొదలగునవి నింద్య గ్రామ్యములు. ఇట్టివి గ్రంధములందు వాడరాదు. అనుకరణమునందు గ్రామ్యము ప్రయోగింప వచ్చును.
"మొక్కేముసామి" యని వేట గ్రాండ్రనిరి. మొ..లగునవి
ఆర్యవ్యవహార దృష్ణమనింద్యము.
కఱకంఠుడు - ప్రాణగోడ్డము.
దినవెచ్చము - రాయభారము మొ..నవి.ఈ ప్రయోగములు నన్నయ - శ్రీనాధాది మహాకవులవి. వీనికి అనింద్యగ్రామ్యమని పేరు. కొందరు వీనిని తద్బవములను చున్నారు.సులభ వ్యాకరణము