పుట:Little Masters Sulabha Vyakaranamu.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

155

ఉపోద్ఘాతము : వ్యాస విషయమందు ప్రవేశ పెట్టబడును. ఈ వ్యాసమునకు సంబంధించి ప్రసిద్ధ పురుషుల వాక్యములిందు పేర్కొన వచ్చును.

వ్యాసచర్చ : వ్యాసమునకు సంబంధించిన చర్చ యిందుండును. స్వీయానుభవమును జూపించి వ్యాసమును ఇందు విపులీకరించవలెను.

లాభ నష్టములు : వ్యాస చర్చలో తేలిన సారాంశమును క్రమ పద్దతిలో చేర్చి వ్రాయవలెను.

ఉపసంహారము : ఇది వ్యాసమునకు ముగింపు. వ్రాసిన వ్యాసముపై తనకు గల అభిప్రాయమునుగాని, మహాపురుషుల అభిప్రాయములు గాని చేర్చి ముగించవలెను.

వ్యాసము క్రమ పద్దతిలో, నిర్మాణాత్మకముగా నుండి పాఠకులకు అభిరుచిని కల్గించవలెను.


(1) వృత్తాంత వ్యాసములు : 1. భరతుడు 2. శ్రీకృష్ణ దేవరాయలు 3. శివాజి 4 అక్బరు 5. బుద్దుడు.


(2) వర్ణన వ్యాసములు : 1. గోవు 2. ఏనుగు 3. హైదరాబాదు 4. హస్తినాపురము 5. గోదావరి


(3) వివరణ వ్యాసములు :

1. సినిమాలు చూచుట వలన లాభనష్టములు
2. విజ్ఞాన యాత్రలు - ప్రాముఖ్యము
3. గ్రంధాలయములు - ఆవశ్యకత
4. వార్తాపత్రికలు
5. కాలము - విలువ
6. శీలము
7. మితవ్యయము
8. మద్యపాన నిషేదము
9. దేశభక్తి
10. సాంకేతిక విద్య
11. ప్రజాస్వామ్యము - రాచరికము
12. వయోజన విద్య
13. శాస్త్ర విజ్ఞానము
14. యుద్దము - నష్టములు
15. అడవులు - ప్రాముఖ్యము
16. వాతావరణ కాలుష్యము
17. లలిత కళలు
18. విద్యార్ధులు - రాజకీయములు
19. ఆహారసమస్య
20. అణుశక్తి - ప్రయోజనములు
21. ఉగ్రవాదము
22. సాహిత్యము - సమాజము
23. మాతృ భాషలో విద్యా బోధన
24. దేశ సమైక్యత
25. ఆలీనోద్యమము


విరామ చిహ్నములు

1. కామా (Camma) వాక్యాంశ బిందువు (,) అసమాపక క్రియలకావలను, సముచ్చయాదులను, కొద్ది కాలమాప వలసి వచ్చు నపుడు ప్రయోగించవలెను.

ఉదా : ఆంజనేయుడు సముద్రమును దాటి, లంకను జేరెను. అశోకవనమున ప్రవేశించి, జానకిని జూచెను.

సులభ వ్యాకరణము