పుట:Little Masters Sulabha Vyakaranamu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14


ఈ యేడు విభక్తులను తెలియ జేయుటకై పదముల చివర వచ్చు వానిని ప్రత్యయములందురు. పై ప్రత్యయములలో డు - ము - వు - న - అనునవి ఏకవచనములు. లు, బహువచన రూపము

7. నకారము ద్రుతము

ద్రుతము అంతమందుగల పదములు ద్రుత ప్రకృతికములు. ద్రుతము అనగా కరగునది అని అర్ధము. కావలసిన పట్ల కనుపట్టుచు అవసరమైన యెడల లోపించునది.

సులభ వ్యాకరణము