పుట:Little Masters Sulabha Vyakaranamu.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

138

దలచుచున్నాను. ఇచ్చట ఉపమేయమైన చీకటికి నల్లదనము, కన్నులు కనపడకుండ చేయుట, వ్యాపనము, అను గుణములు గలవు. ఉపమానమైన ధూమమునకును ఈ గుణములు గలవు. చీకటులు చక్రవాక స్త్రీల విరహాగ్ని ధూమముగా నూహింపబడెను.


మరి కొన్ని ఉదాహరణములు :


1) ఈవెన్నెల పాలవెల్లయో అనునట్లున్నది.


2) క్రోధతామ్రాక్షుడైన శ్రీరాముడు ప్రళయకాలరుద్రుడో యనునట్లున్నాడు.

(11) క్రమాలంకారము :

మొదట చెప్పిన వస్తువుల క్రమమునకు, భంగము లేకుండ, అనుగుణముగా తరువాత వస్తువులంజెప్పిన క్రమాలంకారము.

          ధనమును, విద్యయు, లక్ష్మీ సరస్వతులిత్తురుగాక.

          ధనమిచ్చునది లక్ష్మి - విద్యనిచ్చునది సరస్వతి. అందు వల్ల ఒకే క్రియ ఇరువురికి అన్వయించినది.

          "కసవుచే - నీటిచే - మోద కలవచేత
           బ్రదుకు మృగ - మీన - సజ్జన ప్రకరములకు శబర కైవర్త సూచకజనులు జగతి
           కారణము లేని పగవారు కారెతలవ."

గడ్డిచే బ్రదుకుచున్న లేళ్లకు బోయవాండ్రును నీటిచే బ్రదుకుచున్న చేపలకు బెస్తవాండ్ర వల్లను ఆనందముచే బ్రదుకు సజ్జనులకు కొంటెవాండ్రను కారణము లేని శత్రువులు. ఇట్లు క్రమముగా అర్ధము స్వీకరింపవలెను.

సులభ వ్యాకరణము