పుట:Little Masters Sulabha Vyakaranamu.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

136

లక్ష్యము : గుణము తెలియకుండినను సుకవి వాక్యము కర్ణ రసాయనముగానుండును. (ఉపమేయము) పరిమళమును ఆఘ్రాణింపకుండినను మాలతీ కుసుమ మాలిక నేత్రపర్వముగా ఉండును గదా ! (ఉపమానము)

ఈ రెండు వాక్యములందును కర్ణరసాయనముగా ఉండుట - నేత్రపర్వముగా నుండుట అనునవి విభిన్నధర్మములు. సహజముగా భిన్నములైన వానిని, ఇట సాదృశ్యముచే అభిన్నముగా వేర్వేరుగా చెప్పిరి.

దీనినే బింబప్రతిబింబ భావమందురు.

(7) స్వభావోక్తి (Nature description)

జాతి, గుణ, క్రియాదులు, ఉన్నవియున్నట్లు మనోహరముగా, వర్ణించి చెప్పుట స్వభావోక్తి.


ఆ ఉద్యానవనమున, లేళ్లు చెవులురిక్కించి, చంచల నేత్రములతో, నిటునటు గంతులిడుచున్నవి.


ఇందు లేళ్లయొక్క స్థితి, మనోహరముగా, ఉన్నదున్నట్లు, వర్ణింపబడినది.

(8) అర్దాంతరన్యాసాలంకారము (Corroboration)


విశేషమును సామాన్యముచేగాని, సామాన్యమును విశేషముచేతగాని, సమర్దించినచో అర్దాంతరన్యాసాలంకారమగును.


సామాన్యము = లోకోక్తి లేక లోకప్రసిద్ది ధర్మము.

విశేషము = ప్రత్యేకమైన సంఘటన (incident)

సులభ వ్యాకరణము