పుట:Little Masters Sulabha Vyakaranamu.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

132

       ఉదా : సుదతీ సూతన మదనా !
              మదనాన, తురంగపూర్ణ మణిమయ సదనా !
              సదనామయ, గజరదనా,
              రదనాగేంద్ర నిభ కీర్తి, రస నరసింహా !

ఇందు - మదనా - సదనా - రదనా అను పదభాగములొక పదమున, వదలబడి, తరువాత పదమున, అవ్యవధానముగా గ్రహించబడినవి.

6. అంత్యప్రాసము :


పదాంతమున ప్రాసమున్న అంత్యప్రాసాలంకారము.

            శ్రీరఘురామ ! చారుతులసీ దళధామ ! శమక్షమాది శృం
            గారగుణాభిరామ ! త్రిజగన్నుత శౌర్యరమా లలామ ! దు
            ర్వారక బంధరాక్షస విరామ ! జగజ్జన కల్మషార్ణవో
            త్తారక నామ ! భద్రగిరి దాశరథీ ! కరుణాపయోనిధీ !

            పదాంతమందున్న రామ - ధామ - అభిరామ - లలామ - విరామ - నామ - ఇంతవరకొక అంత్యప్రాసము

            దాశరథీ ! కరుణాపయోనిధీ ! ఇది యొక అంత్యప్రాసము.

అంత్యప్రాసమున్నదని పద్యమున, కుండవలసిన ప్రాసమును తొలగింపరాదు.

సులభ వ్యాకరణము